‘గౌరీ హెగ్డే’గా అదరగొట్టిన సీనియర్ హీరోయిన్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచే విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కలయికపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచుతూ కీలక అప్డేట్స్‌ను విడుదల చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త, దునియా విజయ్, సీనియర్ నటి టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో టబు కనిపించిన తీరు, ఆమె...