పాన్ ఇండియా మైథలాజికల్ మూవీపై అందరిలో ఆసక్తి!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుతోంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కిరణ్.. మరోవైపు భారీ స్థాయిలో తెరకెక్కనున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా, జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘ఇంద్రపుత్ర’ అనే టైటిల్‌ను ఖరారు...