పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ నిర్మాణ గద్దె కూల్చివేతపై బీఆర్‌ఎస్‌ ధర్నా

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ నిర్మాణ గద్దెను కూల్చి వేతను నిరసిస్తూనర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్‌ అధికారులు గద్దెను కూల్చివేశారని పెద్ది అభిమానులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.