కొత్తగా ప్రచారం అవుతున్న వాల్యూమెట్రిక్స్ డైట్.. ఏంటిది..
బరువు తగ్గాలని చాలామంది డైట్ పేరుతో ఆహారాన్ని పూర్తిగా తగ్గించుకోవడం లేదా వింతైన డైట్లను అనుసరించడం చేస్తున్నారు. స్లీపింగ్ బ్యూటీ డైట్, బేబీ ఫుడ్ డైట్, ఐస్ డైట్, సిర్ట్‌ఫుడ్ డైట్, హోల్30 డైట్ వంటి వాటి తర్వాత ఇప్పుడు వాల్యూమెట్రిక్స్ డైట్ కూడా బరువు తగ్గించే విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే మిగతా కొన్ని డైట్లతో పోలిస్తే ఇది తక్కువ కేలరీలు, ఎక్కువ పరిమాణంలో ఉండే ఆహారాలను ఎంచుకోవడంపై దృష్టి పెడుతుంది. వాల్యూమెట్రిక్స్ డైట్‌లో తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు లేదా పీచు పదార్థాలు ఉండే ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి ఆహారాలు ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయని ఈ విధానం చెబుతోంది....