ఏఐ చెప్పిందని పెట్టుబడి పెడుతున్నారా.. ఈ తప్పు చేస్తే భారీ నష్టమే..
కృత్రిమ మేధస్సు (ఏఐ) సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వినియోగం విస్తృతమైపోయింది. సందేహాల నివృత్తికి, సమాచార శోధనకు.. ఇలా అన్నింటికీ ఇప్పుడు ఏఐనే ఆధారమంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఆర్థికపరమైన వ్యవహారాల్లో సలహాల కోసం కూడా ఏఐపై ఆధారపడుతున్నారు. మీరు కూడా అంతేనా? అయితే జాగ్రత్త. ఏఐని అడిగి పెట్టుబడులు పెడితే ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి. ఏఐ అనేది ఓ సాధనం మాత్రమేనని గుర్తుచేస్తున్నారు.గత కొన్నేండ్లుగా ఆర్థిక మార్గదర్శకాల కోసం ఏఐని వాడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. బ్రిటన్‌లో దాదాపు 2.8 కోట్ల మంది గత ఏడాది తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో ఏఐ సాధనాలను సలహాలు అడిగారని...