మదుపరి చనిపోతే మ్యూచువల్ ఫండ్స్ క్లెయిమ్ ఎలా..
కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ బాధ అంతాఇంతా కాదు. అలాంటి సమయంలో కుటుంబ శ్రేయస్సు కోసం వారు పెట్టిన పెట్టుబడుల కోసం మిగతా సభ్యులు నానా ఇబ్బందులు పడాల్సివస్తే మరింత కుంగుబాటు తప్పదు ఎవ్వరికైనా. అయినప్పటికీ చాలా కుటుంబాలు ఇప్పుడు ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. మదుపరి మరణానంతరం వారి కుటుంబ సభ్యులు.. రకరకాల పత్రాలను సమర్పించాల్సి వస్తున్నది మరి. ఈ క్రమంలో పేర్లలో తప్పులు, చిరునామాలో అభ్యంతరాలు, సంతకాలు సరిపోవడం లేదని.. ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ)కు పలు సూచనలు...