కూతురి సంగీత్‌లో చిన్నపిల్లాడిలా మారిపోయిన బండ్ల గణేష్..
టాలీవుడ్‌లో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తన కుమార్తె జనని బండ్ల వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జనని నిశ్చితార్థం వైభవంగా జరగగా.. తాజాగా ఆమె ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. బండ్ల గణేష్ కుమార్తె జనని బండ్ల వివాహం సూర్య తేజ చిలుకూరితో జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే జరిగిన నిశ్చితార్థ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని...