ఫీల్డింగ్‌లో కోహ్లీ ఎనర్జీ వేరే లెవల్..
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై మాజీ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఫీల్డింగ్‌లో చూపించే ఎనర్జీ అద్భుతమని కొనియాడాడు. విరాట్ ప్రభావం జట్టులోని మిగతా ప్లేయర్లపైనా పడుతుందని వెల్లడించాడు. ప్రాక్టీస్‌లో చూపించే ఉత్సాహాన్నే.. మ్యాచ్‌లోనూ ప్రదర్శిస్తాడని తెలిపాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిలీప్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.‘విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ఫీల్డింగ్ విషయంలో రాజీ పడడు. పవర్ ప్లేలో కవర్స్, షార్ట్ మిడ్ వికెట్ వంటి స్థానాల్లో అతడి రిఫ్లెక్సులు, డైవ్స్, బంతిని ఆపే విధానం అద్భుతంగా ఉంటుంది. బంతి తన వైపు రానప్పుడు కూడా అతడి ఫీల్డింగ్...