నా ఓటు తొలగించడం హాస్యాస్పదంగా ఉంది
బెంగళూరు లో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తన ఓటు కూడా ఉన్నదని నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియా (Social లో ఓ సెల్ఫీ వీడియో ను పంచుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ పై ఆయన మాట్లాడారు. తాను పుట్టి పెరిగిన నియోజకవర్గంలో తన ఓటును తొలగించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో తనది కూడా ఉన్నదని, ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. తాను బెంగళూరు నియోజకవర్గంలోనే పుట్టానని, ఇక్కడే నివసించానని, చదువంతా ఇక్కడే పూర్తయిందని, నటన నేర్చుకున్నది కూడా ఇక్కడేనని...