సినిమా పిచ్చి ఉన్నవాళ్లే జనసేనలోకి వెళ్తున్నారు
భారతీయ జనతా పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్లే వారిపై తెలంగాణ బీజేపీ నేత రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వీడి జనసేన పార్టీలో చేరే వారిని ఆ పార్టీలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తే.. కేవలం తాము పవన్ కళ్యాణ్ అభిమానులం కాబట్టే వెళ్లాం అని సమాధానం చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ విధానాల కంటే కేవలం సినిమా హీరో పిచ్చి ఉన్నవారు, సినిమా అభిమానులైన వాళ్లు మాత్రమే జనసేన పార్టీ వైపు వెళ్తున్నారని ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు. రాజకీయాల కంటే వ్యక్తిగత అభిమానంతోనే ఆ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయనే కోణంలో రాంచందర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు...