అతి పెద్ద స్కాం ఇది..పెద్ద కంపెనీలకు చైర్మన్లుగా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్..

బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బండారం బయటపెట్టారని తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్కాం వివరాలను కూలంకషంగా వెల్లడించారు.ఎనుముల కొండల్ రెడ్డి రేవంత్‌ రెడ్డికి తమ్ముడు. ఆయన లింక్డ్‌ ఇన్‌ ప్రొఫైల్‌లో నేను టెసరాక్ట్‌ అనే కంపెనీకి చైర్మన్‌గా ఉన్నానని కొండల్‌ రెడ్డి స్పష్టంగా రాశారు. టెసరాక్ట్‌ అడ్వాన్స్‌ సిస్టమ్స్‌కు భూపాల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్‌కు నేను బాధ్యుడిని అని కొండల్ రెడ్డి చెప్పారు. టెసరాక్ట్‌ సంస్థ ఏర్పాటు చేసిన ఏరో స్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీ, నేను చెప్పుకొని...