తెలంగాణలో తగ్గుతున్న ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య
తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గడిచిన ఏడాదితో పోలిస్తే.. 2025-26 సంవత్సరంలో 1969 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. మరో వైపు ప్రైవేటు స్కూళ్ల సంఖ్య మాత్రం రాష్ట్రంలో పెరుగుతున్నట్లు తెలిసింది. ఇదే వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలో 771 ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరిగినట్లు విద్యాశాఖకు చెందిన యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ డేటా ద్వారా వెల్లడైంది. గత పదేళ్లలో తెలంగాణలో యూడీఐఎస్ఈ ప్లస్ డేటా ప్రకారం ప్రైవేటు స్కూళ్ల సంఖ్య 41 శాతం పెరిగింది. వీటిల్లో విద్యార్థుల ఎన్‌రోల్మెంట్ 64.5 శాతంగా ఉన్నట్లు తెలిసింది.