ఢిల్లీలో ఉగ్ర‌దాడులు జ‌రుగ‌వ‌చ్చ‌న్న ఇంటెలిజెన్స్‌..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ‌ దేశంలో ఉగ్రవాద దాడులుజరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐమద్దతుతో ఉగ్రవాదులు సరిహద్దుల వద్ద లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులకు పాల్పడవచ్చన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేస్తూ కీలక చర్యలు చేపట్టింది. ఆగస్టు 15న ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ వంటి ప్రాంతాల్లో భద్రతా బలగాల దృష్టి వేడుకలపై కేంద్రీకృతమై ఉంటుందని, ఇదే అదనుగా దాడులకు పాల్పడాలని ఐఎస్ఐ భావిస్తున్న‌ద‌ని ‘ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)’ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే), బలూచిస్థాన్‌లో నెలకొన్న అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని...