నీట్ ప‌రీక్ష లీకేజీ.. సీజేపీ నిర‌స‌న.. ఈ అంశాల‌పై పార్ల‌మెంట్‌లో చ‌ర్చిద్దాం : అమిత్ షా

నీట్ ప‌రీక్ష లీకేజీ.. సీజేపీ నిర‌స‌న.. అంశాల‌పై పార్ల‌మెంట్‌లో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలిపారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి గురువారం 3 గంట‌ల వ‌ర‌కు చ‌ర్చిస్తామ‌న్నారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న మీడియాతో ఇవాళ మాట్లాడారు. లాప‌తా, భాగ్ గ‌యా అన్న భాష‌ను వాడుతున్నార‌ని, కానీ తాను పార్ల‌మెంట్‌కు రెగ్యుల‌ర్‌గా వ‌స్తున్నాన‌ని తెలిపారు. త‌న ఛాంబ‌ర్‌లోనే తాను కూర్చుకుంటాన‌ని, కానీ విప‌క్షాలు మాత్రం పార్ల‌మెంట్‌ను అడ్డుకుంటున్నాయ‌ని చెప్పారు. నీట్ నిర‌స‌న‌ల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని త‌మ మంత్రి కిర‌ణ్ రిజిజు కూడా స్ప‌ష్టంగా చెప్పార‌న్నారు. చ‌ర్చ కోసం స‌మ‌యం కేటాయించాల‌ని చెప్పాన‌ని, కానీ...