డ్యాన్సర్ల సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేస్తాం..

తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. 2025–2027 సంవత్సరానికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు ఈ వేడుకలో అధికారికంగా తమ బాధ్యతలను స్వీకరించి ప్రమాణం చేశారు. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు, యూనియన్ నాయకులు, డ్యాన్సర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ అధ్యక్షురాలు సుమలతా దేవితో పాటు పలువురు సినీ ప్రముఖులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పీపుల్స్ మీడియా...