వైరల్‌గా మారిన వీడియో..నడిరోడ్డుపై కత్తితో యువకుడి హల్‌చల్..

ఓ యువకుడు అర్ధనగ్నంగా.. చేతిలో కత్తితో నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు. రోడ్డుపై వెళుతున్న పలువురు పాదచారులపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన చైనాలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హాంగ్ కాంగ్‌, పోక్ ఫు లామ్‌లోని బగ్యువో విల్లాలో 22 ఏళ్ల ఓ యువకుడు సోమవారం ఉదయం అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అతడి చేతిలో ఓ పొడవాటి కత్తి ఉంది. ఆ యువకుడు రోడ్డుపై వెళుతున్న పాదచారులను వెంబడించాడు. పలువురిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.