మాషా అల్లా స్కాం బాధితులకు న్యాయం చేస్తాం

మీకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాషా అల్లా స్కాం బాధితులకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు మాషా అల్లా బాధితులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ గ్రీవెన్స్‌లో దాదాపు 200 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత్ మాట్లాడుతూ.. ఈ స్కాంపై తక్షణమే విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీంతో డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు.బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు....