ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం

ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఏనుగు కేవలం అడవిలో జీవి మాత్రమే కాదని, పర్యావరణ సమతులత్యకు ప్రతీక అన్నారు. భారతదేశ వారసత్వంలో ఏనుగులు అంతర్భాగమని పేర్కొన్నారు.