రూమ్‌ ఫ్రెషనర్లతో ఆరోగ్యానికి ముప్పా?

చాలా మంది ఇళ్లలో రూమ్‌ ఫ్రెషనర్ల వాడకం పెరిగింది. ఇంట్లో దుర్వాసనను తొలగించేందుకు, బంధువులు వచ్చినప్పుడు గది ఆహ్లాదకరమైన వాసనతో ఉండేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం రూమ్‌ ఫ్రెషనర్లు వివిధ రకాల సువాసనల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇళ్లలోనే కాకుండా కార్లు, ఇతర వాహనాల్లోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. స్టోర్‌ రూమ్‌, బాత్రూమ్‌ వంటి ప్రదేశాల్లో అప్పుడప్పుడు రూమ్‌ ఫ్రెషనర్‌ ఉపయోగించడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే, మనం ఎక్కువ సమయం గడిపే గదుల్లో వీటిని తరచుగా ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కృత్రిమ సువాసనలను ఎక్కువగా, ఎక్కువ కాలం పీల్చడం వల్ల కొంతమందిలో అలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని...