ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు పాత ఫీజులే ఖరారు
తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది. 2026-29 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ యూనివర్శిటీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.98 ప్రకారం.. రాబోయే నాలుగేళ్ల కాలానికి పాత ఫీజులే కొనసాగుతాయని స్పష్టం చేసింది. 2023-26 బ్లాక్ పీరియడ్ కోసం గతంలో జీవో నం. 106,132 ద్వారా నిర్ణయించిన ఫీజులే ఈ కొత్త కాలానికి కూడా వర్తిస్తాయని యూనివర్సిటీ రిజిస్ర్టార్ వెల్లడించారు.