హోర్ముజ్ జలసంధి మాది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలో ఉందని, ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. ఇరాన్ నిత్యం అబద్ధాలు ఆడుతోందని, హోర్ముజ్‌పై వారికి నియంత్రణ లేదని, అది తమదని ట్రంప్ అన్నారు. పశ్చిమాసియాలో అమెరికా పటిష్ఠ స్థితిలో ఉందని, 50 ఏళ్లుగా సాగుతున్న బెదిరింపులకు కాలం చెల్లిపోయిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా అన్యాయంగా ఆంక్షలు విధిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోర్ముజ్‌లో ప్రస్తుత పరిస్థితులకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని, వారి దాడులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.