నల్గగొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జేబీ కాలనీలో నివాసముంటున్న రూపారెడ్డి (45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.రూపారెడ్డి కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నది. ఆమె భర్త హైదరాబాద్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భర్త ఫోన్ చేయగా రూపారెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చింది. దీంతో అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి సమాచారం అందించారు.