విమానాలు మారిన విషయం నిజమే
గత నెలలో టర్కీలో నాటో సదస్సుకు హాజరైన తర్వాత తిరుగు ప్రయాణంలో రహస్యంగా విమానాలను మార్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ముప్పు ఎదురయ్యే అవకాశం ఉన్నందునే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. ‘సీక్రెట్ సర్వీస్, సైన్యం సూచించిన విధంగా నడుచుకున్నా. వేరే విమానంలో ప్రయాణించాలని వారు నన్ను అడిగారు’ అని తెలిపారు. గత నెల 8న టర్కీ నుంచి బ్రిటన్ వెళ్లేందుకు కెమేరాల ఎదుట ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఎక్కిన ట్రంప్ ఆ తర్వాత కేటరింగ్ ట్రక్కులో దాక్కుని ఓ సైనిక విమానంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ‘నేను ఎక్కిన జెట్ విమానం మరింత ప్రమాదంలో పడి ఉండేది. ఎందుకంటే వారు...