ఎల్‌నినో ప్రారంభమైంది
న్యూఢిల్లీ: భూమధ్య రేఖ పసిఫిక్ మహా సముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతు పవనాల సీజన్‌లో ఈ వాతావరణ దృగ్విషయం మరింత బలపడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఇండియన్ ఓషన్ డైపోల్(ఐఓడీ) తన బులెటిన్‌లో మధ్య, తూర్పు పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలు వేడెక్కడం ఎల్ నినో పరిస్థితులకు అవసరమైన పరిమితిని దాటినట్లు వెల్లడించింది. కాగా మాన్‌సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్(ఎంఎంసీఎఫ్‌ఎస్) ద్వారా రూపొందిన అంచనాలు సీజన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఎల్‌నినో తీవ్రమయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. భూమధ్య రేఖ పసిఫిక్‌లోని అధిక భాగంలో సముద్ర ఉపరితలం కింద కూడా బలమైన...