రెంటల్ vs పర్సంటేజీ వివాదం- అసలు తేడా ఏంటి? ఏ విధానంలో ఓనర్లకు ఎంత మిగులుతుంది?
తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ఒక పెద్ద వివాదం అందరిని ఆలోచనలో పడేసింది. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు థియేటర్ల యజమానులు ఏకంగా ఎగ్జిబిషన్ ఆపేస్తామంటూ నిర్మాతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా కనిపించాయి. పర్సంటేజీ విధానం కావాలంటూ ఆ మధ్య ఏకంగా రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాను కూడా రాష్ట్రంలో ఆడనివ్వమని తేల్చి చెప్పారు. కానీ చిరంజీవి మధ్యలోకి వెళ్లి ఆ వివాదం పెద్దది కాకుండా సాల్వ్ చేశారు. అసలు ఇన్నాళ్లూ సవ్యంగా సాగుతున్న ఇండస్ట్రీలో సడెన్‌గా ఈ పర్సంటేజీ గోల ఏంటి, పాత పద్ధతికి కొత్త పద్ధతికి మధ్య ఉన్న అసలు తేడా...