చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలి : సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ వినతి

హైదరాబాద్/వరంగల్, జూన్ 18 (సుదీక్ష న్యూస్): చేనేత కార్మికుల ఉపాధి పరిరక్షణ కోసం చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 50కు పైగా చేనేత సహకార సంఘాలకు చెందిన సుమారు 5 వేల మంది కార్మికులు ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, విద్యాసంస్థలకు బెడ్‌షీట్లు, కార్పెట్లు, యూనిఫాంలు తదితర వస్త్ర ఉత్పత్తులను సరఫరా చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. చేనేత రంగ పరిరక్షణ, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని, కేంద్రీకృత టెండర్...