ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యువకుడిపై ‘పాకిస్థానీ’ ముద్ర..
హైదరాబాద్ కాప్రాలోని జనప్రియ లేక్ ఫ్రంట్ సొసైటీలో నివాసితులకు, మేనేజింగ్ కమిటీ సభ్యులకు మధ్య జరిగిన ఒక తీవ్రమైన వాగ్వాదం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఈ గొడవ జరుగుతున్న సమయంలో ఒక యువకుడిని ఉద్దేశించి అక్కడి వారు ‘పాకిస్థానీ’ అని పిలవడంతో వివాదం ఒక్కసారిగా ముదిరింది. దీనిపై సదరు యువకుడు తీవ్రంగా స్పందిస్తూ, “నన్ను పాకిస్థానీ అని ఎలా అంటారు? మా తాతగారు ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా దేశానికి సేవలు అందించారు” అని ఎమోషనల్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెద్ద సంఖ్యలో నివాసితులు, చూసేవారు ఉన్న సమయంలోనే ఈ వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. ఈ గొడవ...