సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి:
సింగరేణిపై బీజేపీ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సింగరేణి సంస్థపై మాట్లాడే నైతిక అర్హత గానీ, అక్కడ పర్యటించే హక్కు గానీ బీజేపీకి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ నాయకులు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సింగరేణికి వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ చర్యల ద్వారా బీజేపీ ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సింగరేణి సంస్థను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని అద్దంకి దయాకర్ ఆరోపించారు. పైకి మాత్రం వేర్వేరుగా...