నాగ‌పూర్ అభ్య‌ర్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంట‌ర్ ..

మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్‌కు చెందిన ఓ విద్యార్థికి.. అబుదాబి సెంట‌ర్ అడ్ర‌స్‌తో నీట్ అడ్మిట్ కార్డుఅబ్దుల్లా మొహ‌మ్మ‌ద్ తాలిబ్ అనే విద్యార్థి మే 3వ తేదీన నీట్ ప‌రీక్ష‌ను నాగ‌పూర్‌లోని స‌ర‌స్వ‌తి విద్యాల‌య‌లో రాశారు. అయితే పేప‌ర్ లీక్ నేప‌థ్యంలో రీ-ఎగ్జామ్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కొత్త అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తాలిబ్ షాక్ అయ్యాడు. యూఏఈలోని అబుదాబి స్కూల్‌లో సెంట‌ర్ కేటాయించ‌డం ప‌ట్ల ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. ఫ‌స్ట్ ప్రిఫ‌రెన్స్‌గా నాగ‌పూర్ ఆ త‌ర్వాత వార్దా, భాంద్రా సిటీల‌ను అభ్య‌ర్థి ఎంపిక చేసుకున్న‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. విదేశీ టెస్ట్ సెంట‌ర్‌ను ఎంపిక చేయ‌లేద‌న్నారు. మా పిల్లోడిని విదేశాల‌కు పంపాల‌న్న ఉద్దేశం లేద‌ని, అత‌నికి పాస్‌పోర్టు లేద‌ని,...