ఆకాశం వైపు ఆశగా చూపులు… కరుణించని వరుణుడి కోసం రైతు నిరీక్షణ”

జూన్ నెల ముగింపుకు చేరుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. సాధారణంగా జూన్ తొలి పక్షంలోనే విస్తారంగా కురవాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి ఆశించిన మేర ప్రభావం చూపకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వానాకాలం సాగు పనులకు సిద్ధమై పొలాలను దున్ని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది రైతులు ముందస్తుగా విత్తనాలు విత్తగా తగినంత తేమ లేక మొలకలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు రైతులు వర్షాల పరిస్థితిని గమనిస్తూ సాగు నిర్ణయాలు తీసుకోవాలని...