అంగన్‌వాడీల్లో త్వరలో 15,982 పోస్టుల భర్తీ! - మీ జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయో చెక్​ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 15,982 పోస్టులను సర్కారు భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని ఐసీడీఎస్‌(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్​మెంట్ సర్వీసెస్) ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమ శాఖ, భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్‌ పోస్టులు, మహబూబ్‌నగర్‌లోని 4 ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి 177 పోస్టులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వేర్వేరుగా ప్రకటనలు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్‌ తప్పనిసరి : 'సాక్ష్యం' అంగన్‌వాడీ నిబంధనల ప్రకారం అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టుల...