24 గంటల్లో రాష్ట్రమంతటా నైరుతి విస్తరణ - 5 రోజుల పాటు భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి మరింతగా విస్తరించాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా మన్నర్​ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ కారణంగా మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఐదు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. మిగతా జిల్లాల్లో...