తక్కువ ధరకే బంగారం అంటూ మోసం..
గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌పై కేసు నమోదు అయ్యింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌లకు సన్నిహితుడినంటూ నమ్మించాడని, తక్కువ ధరకే విదేశీ బంగారం ఇస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించాడంటూ బాధితులు వాపోయారు. అటు బంగారం ఇవ్వక, డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు సూర్య భాయ్ ఇంటికి వెళ్లారు. దీంతో తన దగ్గర ఉన్న మూడు ఐఫోన్లను ఇచ్చి వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పడంతో పాటు రూ.20 లక్షల చెక్ ఇచ్చి పంపించాడు. అయితే, బాధితులు వెళ్లిపోయాక వారిపైనే అత్తాపూర్...