లీక్ చేయడానికి ఇంకా ఏదైనా పరీక్ష మిగిలుందా..

దేశంలో లీక్ చేయడానికి ఇంకా ఏవైనా పరీక్షలు మిగిలున్నాయా అంటూ బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఇప్పుడు మహారాష్ట్రలో టెట్ పరీక్ష పేపర్ లీకవ్వడం కలకలం సృష్టిస్తోంది. వీటిలో నీట్ జాతీయస్థాయి పరీక్ష కాగా, మహారాష్ట్ర టెట్ రాష్ట్రస్థాయి పరీక్ష. ఇటు దేశంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే, అటు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ ఘటనల్లో బీజేపీ నిర్లక్ష్యంపై కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), కాక్రోచ్ జనతా...