రాష్ట్రంలో వారం రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు..

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి రోజులు గడుస్తున్నా వర్షాలు లేక తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రుతుపవనాలు ఆలస్యంగా పుంజుకోవడంతో రాష్ట్రంలో వర్షపాతం కొరత ఏర్పడింది. అయితే తాజాగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రానున్న ఏడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టంచేసింది. వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం.. ఇవాళ‌ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో...