ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు..
నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. రోడ్ నంబర్-4లోని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ పేలుడు ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. ఇంట్లోని మూడు గ్యాస్ సిలిండర్లు, ఫ్రిజ్, గీజర్ పేలలేదని తేలింది. అలాగే అగ్నిప్రమాద ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఘటన సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వీరంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ తన భార్య, కుమారుడితో కలిసి గత 24 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఇంట్లోని వంటింట్లో ఒక్కసారిగా...