కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కీలక మంత్రిమండలి సమావేశానికి ఆమె రాకపోవడంపై సచివాలయ వర్గాలతో పాటు రాజకీయంగానూ పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్ననే సురేఖ తన విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటికీ, ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీకి రాకపోవడం వెనుక బలమైన కారణాలే ఉండి ఉంటాయని అంతా భావిస్తున్నారు. ప్రధానంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వ్యవహారమే మంత్రి కొండా సురేఖ అసంతృప్తికి కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన...