గుండె దీర్ఘ‌కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే త‌ప్ప‌నిస‌రిగా రోజూ పాటించాల్సిన సూచ‌న‌లు ఇవే..

నేటి జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడం, ఒత్తిడి పెరగడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు అన్ని వయసుల వారిలో పెరుగుతున్నాయి. చాలా మంది ఛాతినొప్పి, అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ పెరిగిన తర్వాతే గుండె ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమస్యలు వచ్చిన తర్వాత కాదు, ప్రతిరోజూ కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి కండరాల బలం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో కండరాల మోతాదు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ నిరోధకత తగ్గడం, రక్తపోటు నియంత్రణలో ఉండటం, రక్తనాళాలు గట్టిపడే ప్రమాదం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. కండరాలు...