పోక్సో కేసు.. బండి సాయి భగీరథ్‌ బెయిల్ విచారణ వాయిదా.!

పోక్సో కేసు(POCSO Case)లో అరెస్టైన బండి సాయి భగీరథ్‌(Bandi Sai Bagheerath) బెయిల్ పిటిషన్‌ విచారణ మరోసారి వాయిదా పడింది. భగీరథ్ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సవాల్ చేస్తూ పోలీసులు హై కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. వాదనలు వినిపించేందుకు బాధితురాలి తరఫు న్యాయవాది సమయం కోరారు. దాంతో, తదుపరి విచారణను హైకోర్టు జూలై 6 సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌కు ఊరట లభించలేదు. హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌ హౌస్‌లలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి అరెస్టైన అతడు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు....