మీడియాకు అస‌భ్యంగా మ‌ధ్య వేలు చూపించిన సియా గోయెల్

పుణె (Pune) కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ (Kethan Agarwal) హత్య కేసు (Murder case) లో ప్రధాన నిందితురాలు సియా గోయల్ (Sia Goyel), మీడియా ప్రతినిధులకు అసభ్యకరంగా మధ్యవేలు చూపించిందంటూ వైరల్ అవుతున్న వీడియోపై ఆమె తండ్రి ప్రవీణ్ గోయల్ (Praveen goyel) స్పందించారు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన సైగ కాదని, కారు డోర్‌లో వేళ్లు నలగడంవల్ల కలిగిన నొప్పివ‌ల్ల‌ ఆమె అలా చేయాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పుణె రూరల్ పోలీసులు సియా గోయల్‌ను మార్కెట్ యార్డ్‌లోని ఆమె నివాసానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో నల్లటి టీ-షర్ట్ ధరించి, ముఖానికి...