ఆత్మహత్య ఆలోచనలు డాక్టర్లలోనే ఎక్కువ..
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యానికి వెన్నెముకలా నిలిచే వైద్యులు పనిభారంతో సతమతం అవుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆత్మహత్య ఆలోచనలు చేస్తుండటం తీవ్ర ఆందోళన రేపుతున్నది. తాజాగా ది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఫైమా) దేశవ్యాప్తంగా ‘రివ్యూ మెడికల్ సిస్టమ్(ఆర్‌ఎంఎస్) 2.0’ పేరిట నిర్వహించిన సర్వే వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చింది.City & Local Guides దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాలు, యూటీలు కలిపి 1,260 మంది రెసిడెంట్ డాక్టర్ల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఈ సర్వే రూపొందించినట్టు ఫైమా తెలిపింది. ఇందులో 87.5 శాతం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తేలింది. 87.8 శాతం మంది...