ప్రణయన్న ఆశయ సాధనలో ముందుకెళ్తున్నాం: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండ ,జూలై 6 (సుదీక్ష న్యూస్) : మాజీ మంత్రివర్యులు దివంగత దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి జయంతి–వర్ధంతి సందర్భంగా సోమవారం వరంగల్‌లోని పద్మాక్షి గుట్ట లెప్రసీ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా దాస్యం ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు “ప్రణయ్ భాస్కర్ అమర్ రహే”, “ప్రణయన్న జోహార్లు” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, దాస్యం ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధన...