రవితేజ – శ్రీ విష్ణు మల్టీస్టారర్‌కు క్రేజీ టైటిల్..

టాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజతో పాటు తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు తొలిసారి ఒకే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘వీరాధి వీరులంట’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ టైటిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా కథ, కామెడీ టోన్‌కు తగ్గట్టుగానే ఈ టైటిల్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే...