కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..
నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు గుర్తించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆయా రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో సిద్ధిఖీ కబాబ్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా మాంసాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అలాగే, శ్రీ ద్వారకా రెస్టారెంట్‌లో కాలం చెల్లిన బటర్, శనగపప్పును సీజ్ చేశారు. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ఆహార తయారీలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.