గద్వాల జిల్లాలో దారుణం..
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. శెట్టిఆత్మకూరు గ్రామంలో పాతకక్షలతో ఓ వ్యక్తికి దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సంధ్యా రాజు (45) కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ మహిళను అపహరించాడు. ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనికోసం సదరు మహిళ భర్తను రాజు గతంలోనే హత్య చేసి జైలుకు సైతం వెళ్లాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన రాజును దుండగులు హత్య చేశారు. పాత కక్షలతోనే రాజును హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.