బరువు తగ్గాలని గంటల తరబడి కార్డియో చేస్తున్నారా..
బరువు తగ్గాలంటే తప్పనిసరిగా గంటల తరబడి కార్డియో చేయాలనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. పరుగెత్తడం, సైక్లింగ్ చేయడం లేదా ట్రెడ్‌మిల్‌పై ఎక్కువ సమయం గడపడం వల్లే బరువు తగ్గుతుందని భావిస్తుంటారు. అయితే ఫిట్‌నెస్ నిపుణులు ఇప్పుడు ఈ ఆలోచన పూర్తిగా సరైంది కాదని చెబుతున్నారు. కార్డియో ఆరోగ్యానికి ఉపయోగకరమైన వ్యాయామమే అయినప్పటికీ, బరువు తగ్గడానికి అది ఒక్కటే పరిష్కారం కాదని వారు సూచిస్తున్నారు. కార్డియో వ్యాయామం చేసే సమయంలో శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అయితే ఒకే రకమైన కార్డియోను ప్రతిరోజూ అదే స్థాయిలో చేస్తుంటే, కొంతకాలానికి శరీరం దానికి అలవాటు పడుతుంది. దీంతో మొదట్లో కనిపించినంత ప్రభావం తర్వాత ఉండదు. అలాగే అతిగా...