కిడ్నీ బాధితులు బీట్‌రూట్ తినొచ్చా?
మధుమేహం, అధిక రక్తపోటు, మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బీట్‌రూట్ కిడ్నీ రోగులకు మంచిదా? లేక హానికరమా? అనే సందేహానికి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. కిడ్నీ బాధితులు బీట్‌రూట్ తినొచ్చా? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) ప్రకారం.. కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. బీట్‌రూట్ కూడా అలాంటి ఆహారాల్లో...