బూత్‌లలో SIR ప్రక్రియను పరిశీలించిన బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 8వ డివిజన్ పరిధిలోని 9 బూత్‌లను TPCC జనరల్ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, వివరాల మార్పులకు సంబంధించిన ఫారమ్‌ల నింపుదల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా BLOలు, BLAలతో సమీక్ష నిర్వహించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో 8వ డివిజన్ అధ్యక్షుడు టి. మనోహర్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.