గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు కేవ‌లం కొలెస్ట్రాల్ ఒక్క‌టే కార‌ణం కాదు..

గుండె జబ్బులకు కొలెస్ట్రాల్ ప్రధాన కారణాల్లో ఒకటే కానీ అదే ఒక్క కారణం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానం, తగినంత నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, రక్తపోటు, మధుమేహం వంటి అనేక అంశాలు కలిసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం సరిపోదని, మొత్తం జీవనశైలిపై దృష్టి పెట్టడం అవసరమని సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్ మందులు వాడుతున్నప్పటికీ కొందరికి గుండెపోటు ఎందుకు వస్తుందనే ప్రశ్నకు సమాధానంగా, గుండె జబ్బులు అనేవి ఒకే కారణంతో కాకుండా అనేక కారణాలు కలిసి ఏర్పడే సమస్య అని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, ఏపీవోబీ గుండె జబ్బులకు...