జానకమ్మకు మరణం లేదు.. ఆమె గొంతు ఎప్పటికీ బతికే ఉంటుంది..

భారతీయ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం సంగీతాభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. జూలై 11న ఆమె కన్నుమూయడంతో సినీ, సంగీత రంగాల ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ గాయని పి. సుశీల జానకమ్మను తలచుకుంటూ మాట్లాడిన భావోద్వేగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జానకి గురించి మాట్లాడిన పి. సుశీల తమ‌ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “ఏం చెప్పాలమ్మా… మద్రాస్‌లో మేం ఇద్దరం రెండు పర్వతాల్లా ఉండేవాళ్లం. జానకి అసాధారణ ప్రతిభ కలిగిన గాయని. ఆమె పాడిన విధానం, పాటల్లో చూపించిన వైవిధ్యం నిజంగా...